వంద సార్లు కాళ్ళు మొక్కుడు.. సీటు ఫిక్స్ ఇంకా.!

-

అధికార పార్టీ నేతలకు అండగా అధికారులు ఎప్పుడూ ఉంటారనే చెప్పొచ్చు. అధికార పార్టీ చెప్పినట్లే అధికారులు నడవల్సిన పరిస్తితి ఉంటుంది. ఎవరు అవునన్న కాదన్న ఇదే నిజం. అయితే అదంతా అంతర్గతగా జరిగే అంశం..కానీ ఈ మధ్య అధికారులు ఓపెన్ గానే అధికార పార్టీకు సపోర్ట్ చేయడం, సీఎంలకు భజన చేయడం ఎక్కువైంది. బాధ్యత గల ప్రభుత్వ పదవిలో ఉంటూ..ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు..అధికారంలో ఉన్న వారికి సేవలు చేయడంలో ముందు ఉంటున్నారు.

ఇక తెలంగాణలో అయితే కొందరు అధికారులు.. ఏకంగా సీఎం కేసీఆర్ కాళ్ళ మీద పడిపోతున్నారు. అదేమంటే కేసీఆర్ తమకు పితృ సమానులు అని కవర్ చేస్తున్నారు. అంటే ఆ అధికారులకే పితృ సమానులు మిగతా అధికారులకు కాదా? అనే డౌట్ వస్తుంది. అయితే ఇలా కాళ్ళ మీద పడేవారు.. భవిష్యత్‌లో రాజకీయంగా పదవులు ఇస్తారనే ఆశతో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొందరు అధికారులు రాజకీయాల్లోకి వచ్చారు.. ఎమ్మెల్సీ పదవులు పొందారు.

ఇక తాగ తెలంగాణ హెల్త్ డైరక్టర్ శ్రీనివాసరావు.. కేసీఆర్ కాళ్లు మొక్కడం సంచలనమైన విషయం తెలిసిందే. ఇక ఈయన సీటు ఆశించి..ఇప్పటినుంచే కేసీఆర్‌ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక అధికారి అయి ఉండి..అలా కాళ్ళు మొక్కడాన్ని ఎవరు సమర్ధించట్లేదు. కానీ శ్రీనివాసరావు కాళ్ళ మీద పడటాన్ని సమర్ధించుకుంటున్నారు. తాజాగా కొత్తగూడెంలో జరిగిన వన సమారాధనలో పాల్గొన్న ఆయన…కేసీఆర్ తనకు పితృ సమానులు అని, ఆయన పాదాలని తాకడం అదృష్టంగా ఫీల్ అవుతానని అన్నారు.

“ముఖ్యమంత్రి కేసీఆర్‌ నా దృష్టిలో తెలంగాణ బాపు. ఆయన పాదాలకు నమస్కరిస్తే తప్పేంటి?. ఒక్కసారి కాదు.. వందసార్లు అయినా కేసీఆర్‌ కాళ్లు మొక్కుతా” తనదైన శైలిలో భజన చేసేశారు. ఇక అధికారి అయి ఉండి ఇలా కాళ్ళు మొక్కడం అనేది ముమ్మాటికి కరెక్ట్ కాదనే వాదన వస్తుంది. అయితే కేసీఆర్‌కు ఇంతలా భజన చేయడం వెనుక..శ్రీనివాసరావు కొత్తగూడెం సీటుపై ఆశపడ్డారని, అందుకే వంద సార్లు అయిన కాళ్ళు మొక్కుతానని అంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి చూడాలి శ్రీనివాసరావుకు సీటు దక్కుతుందో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version