దళిత బంధు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు లో వాదనలు ముగిశాయి. అయితే.. దళిత బంధు పథకం తీర్పు ను రిజర్వ్ చేసింది హైకోర్టు. దళిత బంధువును ఎన్నికల సంఘం ఆపడాన్ని సవాల్ చేస్తూ నాలుగు పిటీషన్ ధాఖలు అయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటీషనర్లు కోర్టు వెల్లడించారు. ఒక్క హుజురాబాద్ లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్న పిటీషనర్లు.. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఆమలవుతుందని కోర్టుకు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్ అబ్యాన్ కొనసాగించే విధంగానే దళిత బంధువు పథకాన్ని కూడా కొనసాగించాలని పేర్కొన్నారు పిటీషనర్లు. దళిత బంధు పథకాన్ని ఆపడం వలన చాలా మంది వెనుకబడిన అటువంటివారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని ఇప్పుడు ఎన్నికల సంఘం ఆపడం సరైంది కాదని…వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసిన దళిత బంధు పథకాన్ని అమలు చేసే విదంగా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్లు పేర్కొన్నారు.. అయితే.. పిటీషనర్ల వాదనలు విన్న తెలంగాణ హై కోర్టు.. తీర్పు రీజర్వ్ చేసింది.