తెలంగాణ: షెడ్యూల్ రాకముందే అడ్మిషన్లు తీసుకుంటే చర్యలు తప్పవని రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.పీఆర్వోలను పెట్టుకుని కొన్ని కాలేజీలు అడ్మిషన్లు చేయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వెల్లడించింది. ఇంకా జూనియర్ కాలేజీలకు 2024-25 విద్యా సంవత్సరం అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని, నిబంధనలు ఉల్లంఘించే కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పు దారి పట్టిస్తున్నాయని మండిపడింది.ఇంకా జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు 2024-25 విద్యా సంవత్సరానికి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీ ల్లోనే (షెడ్యూల్ ప్రకారం) విద్యార్థులను జాయిన్ చేయాలని రూల్స్ గురించి వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.జిల్లా ఇంటర్ విద్యా అధికారులు నిబంధనలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది.