ఏపీ వాటాకు మించి నీటిని వాడుకుంది.. KRMBకి తెలంగాణ ఫిర్యాదు

-

ఏపీపై తెలంగాణ నీటిపారుదల శాఖ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఏపీ ఉమ్మడి జలాశయాల నుంచి వాటాకు మించి నీటిని ఉపయోగించుకుందని…. ఇక నుంచి నీటిని వాడుకోకుండా చూడాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. ఈ మేరకు కేఆర్​ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఏపీ 673 టీఎంసీల కృష్ణా జలాలను ఉపయోగించుకుందని… 971 టీఎంసీల్లో ఇది 74 శాతానికి పైగా ఉందని లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ కేవలం 211 టీఎంసీలను మాత్రమే వాడుకొందని… 971 టీఎంసీల్లో ఇది కేవలం 25 మాత్రమేనని ఈఎన్సీ మురళీధర్​ లేఖలో పేర్కొన్నారు.. ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి 32 టీఎంసీలను అధికంగా ఉపయోగించుకొందని… తెలంగాణకు ఈ ఏడాది ఇంకా 108 టీఎంసీలు వాటాగా దక్కాల్సి ఉందని అన్నారు. ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్​లో ఇంకా కేవలం 76 టీఎంసీల నీరు మాత్రమే ఉందని… ఇదే సందర్భంలో ఏపీ తన వాటాకు మించి నీటిని తీసుకొందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version