స్వచ్ఛ సర్వేక్షణ్ 6 ర్యాంకుల్లో 4 తెలంగాణవే : కేటీఆర్

-

స్వచ్ఛ సర్వేక్షణ్ కింద దేశంలో 6 జిల్లాలకు ర్యాంకులు ఇస్తే..అందులో 4 జిల్లాలు తెలంగాణకు చెందినవే ఉన్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో తండాలను గ్రామ పంచాయతీలుగా చేసింది కేసీఆర్ అని గుర్తు చేశారు. గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతానికి రిజర్వేషన్​లు పెంచామని చెప్పారు. దళితుల కోసం దళితబంధు కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. మహబూబాబాద్ జిల్లాలో 20,000 మంది మహిళలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలోనే అత్యుత్తమ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తింపు తెచ్చుకున్నారని మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజనలో రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని వివరించారు. చక్కని పనితీరు కనబర్చిన 20 గ్రామాల్లో.. 19 మన రాష్ట్రంలోనే ఉన్నాయని పేర్కొన్నారు. రెండు త్రైమాసికాలకు సంబంధించి కేంద్రం 3, 4 స్టార్‌ రేటింగ్‌లు ఇచ్చాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు పెరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తక్కువ కాలంలోనే భారతదేశంలోనే.. తెెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలిచిందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version