తెలంగాణ కొత్త సచివాలయానికి తుదిమెరుగులు

-

మరో నెల రోజుల్లో తెలంగాణ నూతన సచివాలయం అందుబాటులోకి రానుంది. తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా కొత్త సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది. విశాలమైన కారిడార్లు, ధారాళంగా వెలుతురు, గాలి వచ్చేలా గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు లోబడి ఆధునిక భవంతిని నిర్మించారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్‌ పేరు పెట్టిన తెలంగాణ రాష్ట్ర సచివాలయం… ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినమైన అయిన ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది.

రహదారులు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రెండు, మూడు రోజులకోసారి వస్తూ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాష్ట్ర నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని గతంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం తుది మెరుగులు దిద్దుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version