యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు నిధులను ఈ నెల 28 నుంచి చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశించారు. ఈ సీజన్ లో రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7,600కోట్ల నగదును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది.
కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రావాల్సిన నిధుల్లో తగ్గుదల, రుణ పరిమితికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పుల్లో కోత నేపథ్యంలో రాష్ట్రానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇక్కట్లు ఎదురయ్యాయి. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అంచనాలకు అనుగుణంగానే ఉంది.
సగటున ప్రతినెల రూ.10 వేల కోట్ల మార్కును అధిగమిస్తోంది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగినంతగా రాకపోవడంతో పాటు అప్పుల్లో కోతతో సర్కార్ ప్రణాళికకు ఇబ్బంది ఏర్పడింది. అయితే, రైతుబంధు నిధుల కోసం తెలంగాణ రూ.2 వేల కోట్ల అప్పు చేస్తోందని సమాచారం అందుతోంది.