ఏపీలో ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది – బొప్పరాజు

-

జగన్‌ సర్కార్‌ పై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడితో ఇబ్బందులకు గురవుతూ చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

కర్నూలు జిల్లా ఆదోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో గురువారం రాత్రి ఆదోని డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం బొప్పరాజు విలేకరులతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. రోజురోజుకు ఉద్యోగులు పని ఒత్తిడికి గురవుతూ మానసికంగా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రీసర్వే కార్యక్రమంతో రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు ఇస్తుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటో తేదీన తప్పనిసరిగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version