తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను.. బీఆర్ఎస్ సెటైర్లు

-

బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.తెలంగాణకు హోం మంత్రే కాదు.. విద్యాశాఖ మంత్రి కూడా లేడు అని సెటైర్లు వేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దాదాపు 200 రోజులు అవుతున్నా.. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు అని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నూతన విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కానీ విద్యాలయాల అవసరాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల బాగోగులు పట్టించుకునే నాథుడే లేడు అని మండిపడింది.అందుకే… వెంటనే…తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను అని ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version