కేంద్రం సహకరిస్తే.. తెలంగాణ నెంబర్ వన్ అవుతుంది : మహేష్ కుమార్ గౌడ్

-

కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ తో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ మీద ప్రేమ ఉండొచ్చు.. కానీ అభివృద్ధి విషయంలో కాళ్లు లాగే పని చేయవద్దని సూచించారు. పదేళ్లుగా ప్రధాని దగ్గరికి వెల్లి తెలంగాణ నిధులపై చర్చ చేశారా..? అని ప్రశ్నించారు. 

కేంద్రం తెలంగాణ కి ఏం ఇచ్చింది అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి పదవీ ఇచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కేంద్రం సహకరిస్తే.. తెలంగాణ నెంబర్ వన్ అవుతుందని పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనకి మద్దతు లేదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ట్రిపుల్ ఆర్ వద్దా..? స్కిల్ యూనివర్సిటీ వద్దా..? అని పేర్కొన్నారు. కేసీఆర్ కులంకి చెందిన రామ్మోహన్ నాయుడిని.. తెలంగాణకు తీసుకొచ్చి కేసీఆర్ ను పొగిడే పని చేశారు కిషన్ రెడ్డి అని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి మీరు తెలంగాణ బిడ్డ కాదా..? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version