ఏ సమస్య వచ్చినా పూర్తి బాధ్యత ఆ జిల్లా అధికారులదే : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రగతి భవన్ ను ప్రజాపాలన భవన్ గా మార్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్, ఎమ్మార్వో వంటి కార్యాలయాల్లో ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు.

ఇటీవలే భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండి నీటి స్టోరేజీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ జలసౌధలో ప్రాజెక్టులు, జలాశయాల్లో ప్రస్తుత పరిస్థితిపై ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్షాల వల్ల జరిగిన నష్టం, మరమ్మతులపై ఆరా తీశారు. ఏ సమస్య వచ్చినా పూర్తి బాధ్యత ఆ జిల్లా అధికారులదేనని తెలిపారు.  వరదలతో ఎంత నష్టం వాటిల్లిందో పూర్తి వివరాలు ఇవాళే ఇవ్వాలని ఆదేశించారు. డ్యామేజీల మరమ్మతులు కోసం షార్ట్ టైమ్ టెండర్లు పిలవాలని ఆదేశించారు. రిజర్వాయర్లలో సామర్థ్యం మేరకు స్టోరేజీ ఉంచుకోవాలని సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version