బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన వారికి షాక్ తగిలింది. తాజాగా పార్టీ ఫిరాయింపుల పై సుప్రీం కోర్టుకు వెళ్లింది గులాబీ పార్టీ. ఈ తరుణంలోనే ఇవాళ సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయింపుల పై విచారణ జరుగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యే ఫిరాయింపుల పై సుప్రీంకోర్టును ఆశ్రయించింది బిఆర్ఎస్ పార్టీ. అయితే… బిఆర్ఎస్ పిటిషన్ పై జస్టిస్ బి ఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ విచారణ జరపనుంది.
ముగ్గురు ఎమ్మెల్యేల పై సుప్రీం కోర్టులో SLP వేసింది బిఆర్ఎస్. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారన్న సంగతి తెలిసిందే. వాళ్లపై చర్యలకు టైం ఫ్రేం పెట్టాలని సుప్రీం ను ఆశ్రయించింది బిఆర్ఎస్ పార్టీ. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని గతంలో ఆదేశించింది హైకోర్ట్ డివిజన్ బెంచ్. హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేసిన బిఆర్ఎస్..ముగ్గురు ఎమ్మెల్యేల పై SLP వేసింది.