తెలంగాణలో ఓమిక్రాన్ కేసులు ఈ రోజు కూడా భారీగానే నమోదు అయ్యాయి. ఈ ఒక్క రోజే 12 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగ దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఓమిక్రాన్ కేసుల సంఖ్య 79 కి చేరింది. కాగ దీనిలో ఇప్పటి వరకు 27 మంది ఓమిక్రాన్ వేరియంట్ ను జయించి కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కాగ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజు కు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చే వారికి ఓమిక్రాన్ వేరియంట్ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో లోకల్ ట్రాన్స్ ఫర్మెషన్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో క్రిస్మస్ తో పాటు న్యూయర్ వేడుకలు రావడంతో కొద్ది రోజుల్లోనే ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి విపరీతంగా ఉండే అవకాశాలు ఉంది. దీంతో ప్రజలు ఓమిక్రాన్ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. కరోనా నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు.