ఇందిరమ్మ ఇళ్లకు 12 వేల 571 కోట్లు – భట్టి

-

ఇందిరమ్మ ఇళ్లకు 12 వేల 571 కోట్లు కేటాయింపులు చేసింది తెలంగాణ సర్కార్‌. ఇవాళ తెలంగాణ ప్రభుత్వ 2025-26 వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు భట్టి విక్రమార్క. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూల వ్యయం రూ.36,504 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రగతి, సంక్షేమం, సుప్రభుత్వం లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.12,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

bhatti

25.35 లక్షల రైతులకు రూ. 20,616 కోట్లు రుణ మాఫీ చేసిన్నట్లు ప్రకటించారు. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుందని..43 లక్షల కుటుంబాలకు గ్యాస్ సబ్సిడీకి రూ. 433 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. గృహజ్యోతి పథకంలో 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వెల్లడించారు. 4.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్లు పథక ప్రారంభం చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. వడ వరి కొనుగోలుకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇస్తున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news