ఏపీలో నేడు కొత్త‌గా 122 క‌రోనా కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజు రోజుకు క్రమంగా త‌గ్గుతుంది. గ‌తంతో పోలిస్తే.. క‌రోనా కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతున్నాయి. కాగ ఈ రోజు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించిన క‌రోనా బులిటెన్ ప్రకారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త‌గా 122 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో నేటి వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,18,176 కు చేరింది.

కాగ ప్ర‌స్తుతం రాష్ట్రంలో కేవ‌లం 1,543 క‌రోనా యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 23,01,904 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. అలాగే రాష్ట్రంలో నేటి వ‌ర‌కు 14,729 మంది క‌రోనా మ‌హ‌మ్మారి బారిన ప‌డి మృతి చెందారు. కాగ క‌రోనా వైర‌స్ వ్యాప్తి పూర్తిగా త‌గ్గ‌డంతో ప్ర‌జ‌లు.. క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేదు. అయితే క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌క పాటించాల‌ని.. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి తగ్గినా.. ముప్పు త‌గ్గిపోలేద‌ని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version