16 రాష్ట్రాలకు కేంద్రం నిధులు..తెలంగాణకు రూ.2 వేల కోట్లు విడుదల

-

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశంలోని 16 రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి కింద రూ. 56,415 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ప్రత్యేక సాయం కింద ఈ నిధులు ఇవ్వనుండగా… తెలంగాణకు రూ. 2,102 కోట్లు, అత్యధికంగా బీహార్ కు రూ. 9,640 కోట్లు కేటాయించింది.

KCR and Modi

ఈ జాబితాలో ఏపీకి మాత్రం చోటు దక్కలేదు. 2023-24కు గాను ‘స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్’ పేరిట ప్రత్యేక పథకాన్ని కేంద్రం ప్రకటించింది. కాగా, మహారాష్ట్రలో రెండ్రోజుల పర్యటనకు సోమవారం రోజున హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్ సాయంత్రానికి సోలాపూర్​ చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్​కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సోలాపూర్ నేత భగీరథ బాల్కే.. ఇతరులు బీఆర్ఎస్​లో చేరారు. స్థానిక నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలు కేసీఆర్​ను కలిశారు. అనంతరం రాత్రి అక్కడే బస చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version