తెలుగు రాష్ట్రాలల్లో ఉన్న ప్రజలకు బిగ్ అలర్ట్. మరో 20 రైళ్లు రద్దు అయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో ఇవ్వాళ.. రేపు.. నడపవలసిన మరో 20 రైళ్ళను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది దక్షిణ మధ్య రైల్వే. దీంతో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో 544 ట్రైన్ లను భారీ వర్షాల కారణంగా రద్దు అయినట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే.
తాజాగా మరో 20 రైళ్ళను దారి మళ్లించారు రైల్వే శాఖ అధికారులు. దీం తో ఈ లెక్కన ఇప్పటివరకు 187 రైళ్ళను పైగా దారి మళ్లించిందట దక్షిణ మధ్య రైల్వే. అటు తాత్కాలికంగా మూడు రోజుల్లో 20కి పైగా రైళ్ళను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు.