40 శాతం రైతులకు రుణమాఫీ కాలేదు – హరీష్ రావు

-

40 శాతం రైతులకు రుణమాఫీ కాలేదన్నారు హరీష్‌ రావు. రైతు రుణమాఫీ పై రేషన్ కార్డు నిబంధనలు లేదు అన్నారు, కానీ జీవో ఇవ్వలేదన్నారు. దీనితో రేషన్ కార్డు లేని వారికి రుణమాఫీ జరగలేదని ఫైర్‌ అయ్యారు. pmksy, రేషన్ కార్డు నిబంధనల వల్ల నలభై శాతం వారికి రుణమాఫీ అవ్వట్లేదని తెలిపారు.

40 percent farmers have not received loan waiver

సర్పంచ్‌ లు నా దగ్గరకు వచ్చి బాధలు చెప్పుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పరువు తీశారు మాజీ మంత్రి హరీష్‌ రావు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్ లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ లకు నిధులు ఇవ్వట్లేదని… కేంద్రం నుంచి వచ్చిన 500 కోట్లు వచ్చినా విడుదల చేయట్లేదని ఆగ్రహించారు. గ్రామ పంచాయతీ ల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని… సర్పంచ్ లు ఆగమయ్యాం అని నాకు వినతిపత్రం ఇస్తున్నారన్నారు. ప్రతిపక్షం తట్టిలేపితే కానీ ఈ ప్రభుత్వానికి సోయి లేదని…. గ్రామ పంచాయతీ ల ట్రాక్టర్ లకు డీజిల్ కూడా పోయట్లేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version