తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త..వారంలో 4,661 నర్సు పోస్టులకు నోటిఫికేషన్

-

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ తదుపరి కార్యాచరణ పై దృష్టి పెట్టింది. 4,661 స్టాఫ్ నర్సుల నియామక ప్రకటనను వెలువరించాలని నిర్ణయించింది. ఈ నెల 31 లోపే ఆ ప్రకటన కూడా వెలువరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ ద్వారా ఇప్పటివరకు వైద్యుల నియామక ప్రక్రియను మాత్రమే నిర్వహించారు.

వైద్యుల నియామకాల్లో అర్హత పరీక్ష నిర్వహించలేదు. వారి అర్హత మార్కులను, వేయిటేజిని ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే నర్సుల పోస్టుల భర్తీకి మాత్రం అర్హత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెలాఖరులోగా నియామక ప్రకటన వెలువరించి, పరీక్షకు అభ్యర్థులు సన్నద్దం అవ్వడానికి వీలుగా కనీసం రెండు నెలల గడువు ఇస్తారు. బహుళ ఐచ్చిక సమాధానాల రూపంలో ప్రశ్నపత్రం రూపకల్పనకు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని నియమిస్తారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version