ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కృష్ణారావు అన్నారు.నిజామాబాద్ కలెక్టరేట్‌లో ప్రజా పాలనపై కలెక్టర్ ,ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రజా పాలన నిర్వహణ ప్రణాళిక పక్కగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజల సంక్షేమ కోసం 6 గ్యారంటీల పథకాలను చేపట్టామని అన్నారు. ఎంతోమంది పేదలు తమ కష్టాలు నెరవేరుతాయని ఆశగా ఉన్నారని అన్నారు.
ప్రజల సమస్యలను తీర్చి వారి ఆర్థిక ప్రగతికి తోడ్పాడలనే ఉద్దేశంతో ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా ప్రజల నుంచి అప్లికేన్లను స్వీకరించాలని నిర్ణయించిందని వెల్లడించారు.అధికారులు మొక్కుబడిగా కాకుండా అత్యంత పారదర్శంకంగా పని చేయాలని ప్రజల నుంచి వచ్చే అప్లికేన్లను స్వీకరించి ఆ డాటాను డిజిటలైజ్ చేయాలని కోరారు .