రేషన్ కార్డు దారులకు 6 కిలోల సన్న బియ్యం ఇస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి. ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ప్రజలను ఉద్దేశించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ…కల్తీ విత్తనాలను అరికట్టడానికి పోలీస్ మరియు వ్యవసాయ శాఖల అధికారులతో ప్రతి మండలం, డివిజన్ స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేయడం జరిగింది. రాయితీపై వివిధ రకాల పచ్చి రొట్టె విత్తనాలను రైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
విద్యుత్ శాఖ 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 21.66 కోట్ల వ్యయంతో 132/133 కెవి పమ్మి సబ్ స్టేషన్ పనులు మరియు రూ. 1.3 కోట్ల వ్యయంతో 18 కెఎం 33కెవి లైన్లు పూర్తి చేసి వినియోగం లోకి తీసుకున్నామన్నారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో వివిధ కేటగిరిల క్రింద 5,071 సర్వీసులను రిలీజు చేయడం జరిగింది.షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా జిల్లాలో 41 వసతి గృహములు నిర్వహించబడుచున్నవి. ఇందులో 3309 మంది విద్యార్థినీ, విద్యార్థులు వసతిని పొందుతున్నారు. డిపార్ట్ మెంట్ అటాచ్డ్ హాస్టళ్ళ క్రింద ఇంటర్ నుండి పిజి వరకు 11 వసతి గృహాలు వుండగా, ఇందులో మొత్తం 1325 మంది విద్యార్థినీ విద్యార్థులు వసతిని పొందుతున్నారని తెలిపారు.