కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఈ అమానుషంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు కూడా సోషళ్ మీడియా వేదికలపై స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా ఓ వీడియో షేర్ చేశారు. ఈ దారుణాన్ని ఖండిస్తూ ఆయన స్వయంగా ఓ కవిత రాశారు. ఆ కవితను చదవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
‘‘నేనే అబ్బాయిని అయితే.. గది తలుపు తాళం వేయకుండానే పడుకునేదాన్ని. నేనే అబ్బాయిని అయితే స్వేచ్ఛగా పరిగెత్తేదాన్ని. ఆడపిల్లలను చదివించాలని.. వారిని బలంగా తీర్చిదిద్దాలని ఎంతోమంది చెబుతుంటారు. తీరా కష్టపడి చదివి డాక్టర్ అయినా కూడా.. ఆ కంటిరెప్పను కాపాడుకోవాల్సిన పరిస్థితే నేడు మనదేశంలో ఉంది. అదే నేనే అబ్బాయిని అయి ఉంటే..!’’ అంటూ ఓ అమ్మాయి మనోగతాన్ని ఆయన ఎమోషనల్‌గా చెప్పిన తీరు అందరితో కంటనీరు పెట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
🚨 BOLLYWOOD BREAKS ITS SILENCE! 🚨
➡️ Ayushmann Khurrana speaks out in support of the female doctor from Bengal.
➡️ Bollywood, often quiet on national issues, finally raises a voice.#AyushmannKhurrana #JusticeForMoumita pic.twitter.com/mFuSSyR7mD
— Siddharth (@SidKeVichaar) August 14, 2024