విషాదం.. పసిబిడ్డ ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌ ఛార్జర్‌ పిన్‌

-

నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పటివరకు ఆడుకున్న చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ జరిగింది.. గ్రామానికి చెందిన దుర్గం రాజలింగు, సుశీల దంపతుల రెండో కూతురు ఏడున్నరేళ్ల ఆరాధ్య ఇంట్లో ఆడుకుంటూ.. విద్యుత్ బోర్డుకు పెట్టి ఉన్న సెల్‌ఫోన్‌ చార్జర్‌ కిందకు వేలాడుతోంది. అయితే ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ చిన్నారి ఆ వైరు వద్దకు వెళ్లింది. సాధారణంగా చిన్న పిల్లలు ఏది కనిపించినా ముందు నోట్లో పెట్టుకుంటారు. ఆరాధ్య కూడా సెల్ఫోన్ ఛార్జర్ను నోట్లో పెట్టుకుంది. అయితే ఆ సమయానికి స్విచ్ ఆన్ చేసి ఉండటంతో విద్యుదాఘాతానికి గురై పడిపోయింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఖానాపూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు చిన్నారి మరణించినట్టు నిర్ధారించారు. అభం శుభం తెలియని ఆ చిన్నారి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. తమ నిర్లక్ష్యం వల్లే తమ కంటిపాపను పోగొట్టుకున్నామంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version