BRS మాజీ ఎంపీ సంతోష్ రావు పై కేసు నమోదు

-

పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కొంత మంది నేతలు అధికార కాంగ్రెస్ లో చేరుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఇటీవలే  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారం రోజుల పాటు ఈడీ కస్టడిలోనే ఉంది. ఈనెల 26 వరకు కూడా ఈడీ కస్టడీలోనే ఉండనుంది.

లిక్కర్ కేసు నుంచి కోలుకోక ముందే తాజాగా బీఆర్ఎస్ కీలక నేత మరో వివాదంలో చిక్కుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్ పై బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్  పోలీస్ స్టేషన్ లో సంతోష్ రావు పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఇప్పటికే బీఆర్ఎస్ 16 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version