కేటీఆర్, హరీశ్ రావు పై కేసు నమోదు

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పై కేసు నమోదు అయింది. గురువారం హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ ఆఫీస్ లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.

ఇటీవలే సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి  మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ఎంపీ రఘునందన్ రావు ఆమెకు స్వాగతం పలుకుతూ నూలుపోగు దండా వేశారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారని సాక్ష్యాలతో సహా కొండా సురేఖ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేటీఆర్-కొండా సురేఖ మధ్య మాటల యుద్ధం సినీ ఇండస్ట్రీ వరకు వెళ్లింది. ఇక ఇదే అంశం పై ఎంపీ రఘునందన్ రావు కూడా స్పందించి బీఆర్ఎస్ శ్రేణులపై మండిపడ్డారు. ఈ ఇష్యూ పై దుబ్బాక, సిద్దిపేట, సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version