తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై కేసు నమోదు అయింది. ఓ మహిళ ఇచ్చిన పిర్యాదు పై సీఐడీ ఎస్పీ పై కేస్ నమోదు అయింది. కొత్త పేటలోని TSSPDCL సీనియర్ అసిస్టెంట్ ను సిఐడి ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేశాడు. తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్న వాటిలో పాల్గొనాలని మహిళా ఉద్యోగినికి చెప్పిన కిషన్ సింగ్… మహిళ ఫోన్ నంబర్ తీసుకుని తరచూ ఆమెకు అభ్యంతరకర మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు పంపించేశాడట.
శారీలో నిన్ను చూడాలని ఉంది, నీ ఫోటోలు పంపు అంటూ తరచూ వేదింపులకు గురిచేశాడట. ఓ కేసు విషయంలో తనను మరోసారి సంప్రదించిన సమయంలో తనకు సహకరించాలంటూ మరోసారి వేధింపులకు గురించేశాడట. ఇక ఈ వేధింపులు తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది మహిళా ఉద్యోగిని. దీంతో సీఐడి ఎస్పీ కిషన్ సింగ్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు చైతన్య పూరి పోలీసులు.