టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడానిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థను నెలకొల్పి పలు సినిమాలను నిర్మించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలను నిర్మిస్తూ ఏ సినిమా అయినా సరే ఆయన హ్యాండ్ పడితే సూపర్ హిట్ అన్న ఘనతను కూడా దక్కించుకున్నారు. ముఖ్యంగా ఆయన నిర్మాణ సారధ్యంలో వచ్చిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇకపోతే తాజాగా రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు దిల్ రాజు.
ఆ వ్యాఖ్యలు భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కు ఆదివారం అంటే ఈరోజు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి అధ్యక్ష పదవి కోసం దిల్ రాజు పోటీ పడుతున్నారు ఆయనకి పోటీగా నిర్మాత సి .కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు దిల్ రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న, పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ కూడా సినీ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం నన్ను ప్రెసిడెంటుగా ఉండమని కోరుతున్నారు.
ఇక విలేకరులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. అయితే ఎప్పుడు అనేది చెప్పలేము.. కానీ నేను ఏ రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసినా సరే తప్పకుండా ఎంపీగా గెలుస్తానని నమ్మకం నాకు ఉంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉంటే చిత్రసీమకు మేలు జరుగుతుందని, సినీ ఇండస్ట్రీలో మిత్రులు కోరుకుంటున్నారని కూడా తెలిపారు.