లాస్య నందిత పీఏ ఆకాష్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

-

గులాబీ పార్టీ ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్‌పై పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఆకాష్‌పై లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు చేసారు. నిర్లక్ష్యంగా కారు నడిపి లాస్య నందిత మరణానికి కారణం అయ్యారని ఫిర్యాదు చేశారు. 304 సెక్షన్ కింద ఆకాష్‌పై కేసు నమోదు చేశారు. పూజల కోసం సదాశివపేట మిస్కిన్ షా బాబా దర్గాకు కుటుంబసభ్యులు వెళ్లారు.

తెల్లవారుజామున రెండు కార్లలో తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఈ తరుణంలోనే పూజల కారణంగా రోజంతా ఏమీ తినకపోవడంతో ఉదయమే అల్పాహారం కోసం సంగారెడ్డి వైపు పయనం అయ్యారు. నిద్రమత్తులో అతి వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణం అయ్యాడు ఆకాష్. తీవ్ర గాయలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆకాష్. దింతో ముందువెళ్తున్న వేరే వాహనాన్ని లాస్య కారు ఢీకొట్టినట్లుందని.. సీటు బెల్టు కూడా పెట్టుకున్నట్టే ఉందని సంగారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ సంజీవరావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version