BREAKING : నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు కాస్త వరద తగ్గింది. దీంతో కడెం ప్రాజెక్టుకు తప్పింది ముప్పు. కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు లోతట్టు ప్రజలు. భారీ వరద నేపథ్యంలో హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు.. ప్రజలను కూడా అలర్ట్ చేశారు.
67 ఏళ్ల లో ఈ స్థాయి వరద తొలిసారి అంటున్నారు అధికారులు. అయితే.. తాజాగా కడెం ప్రాజెక్టుకు కాస్త వరద తగ్గిందని.. దీంతో ప్రాజెక్టుకు ముప్పు తప్పిందని అధికారులు స్పష్టం చేశారు. కాగా… తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేసినట్లు మంత్రి వేముల ప్రశాం త్ రెడ్డి ప్రకటించారు. గత నాలుగు రోజుల నుండి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.