మొయినాబాద్ మామిడి తోట కోళ్ల పందేల కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కోడి పందేలలో తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి ప్రధాన అనుచరుడు, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు,కేపీవీ రామచంద్ర రావు సన్నిహితులు పాల్గొన్నారని సమాచారం అందుతోంది. పోలీసుల రైడ్ అనంతరం అధికారులకి ఫోన్ చేసి కేవీపీ రామచంద్రరావు సన్నిహితులను తప్పించారట ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి. ఈ విషయాలను బీఆర్ఎస్ పార్టీ వైరల్ చేస్తోంది.

గత రెండు సంవత్సరాలుగా పోచంపల్లి ఫారం హౌసులో నిత్యం కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు సంవత్సరాల్లో పందాల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నిర్వహించిన కోడిపందాల సమాచారం తెలుసుకొని పోలీసుల దాడి జరిగిందట. దీంతో పోలీసుల రాకతో స్పాట్ నుండి పారిపోయారట పలువురు జూదగాల్లు. పారిపోయిన వారిలో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి కూడా ఉన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారు.
మొయినాబాద్ మామిడి తోట కోళ్ల పందేల కేసులో ట్విస్ట్
కోడి పందేలలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి ప్రధాన అనుచరుడు, తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు,కేపీవీ రామచంద్ర రావు సన్నిహితులు
పోలీసుల రైడ్ అనంతరం అధికారులకి ఫోన్ చేసి కేవీపీ రామచంద్రరావు… pic.twitter.com/Ss4KTE12e1
— Telugu Scribe (@TeluguScribe) February 14, 2025