నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఇవ్వాలంటూ సోనియా గాంధీకి సంపత్‌ కుమార్ లేఖ

-

నాగర్ కర్నూల్ లోకసభ టిక్కెట్ మాదిగలకు ఇవ్వాలని కోరుతూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సోనియాగాంధీకి లేఖ రాశారు. ఈ నియోజకవర్గంలో మాదిగ ఓట్లు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం ఓటర్లు 17 లక్షల 30 వేల 781 ఉండగా అందులో మాదిగల సంబంధించిన ఓటర్లు మూడు లక్షల 75వేల 532 ఉండగా మాల ఓట్లు కేవలం 62,801 ఉన్నట్లు వివరించారు.

నాగర్ కర్నూలు టికెట్ మాజీ ఎంపీ మల్లు రవికి కేటాయించినట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఈ మేరకు సోనియా గాంధీకి లేఖ రాశారు. మల్లు రవికి ఇప్పటికే కేబినెట్ హోదా కలిగిన దిల్లీ ప్రత్యేక ప్రతినిధి పదవి ఉందని, ఖమ్మం నుంచి గెలుపొందిన ఆయన సోదరుడు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. తాను స్క్రీనింగ్ కమిటీ సమావేశాల్లో మహారాష్ట్రలో బిజీగా ఉన్నానని దానిని ఆసరా చేసుకుని నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి మల్లురవి పేరు ఒక్కటే పంపారని తెలిపారు. గడిచిన 30 సంవత్సరాలుగా పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తున్నట్టుగా లేఖలో స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version