BIG BREAKING : బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్యే

-

BIG BREAKING : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల సమయం కూడా లేదు. ఇలాంటి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళనున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Alampur BRS MLA Abraham into congress

రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు అబ్రహం. వాస్తవానికి అలంపూర్ ఎమ్మెల్యే టికెట్ మొదట అబ్రహం కు ఇచ్చారు సీఎం కేసీఆర్. కానీ బీఫామ్ మాత్రం విజేయుడు అనే వ్యక్తికి సీఎం కేసీఆర్ ఇచ్చారు. దీంతో అబ్రహం అప్పటినుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇక ఇవాళ కాంగ్రెస్ పార్టీలో అబ్రహం చేరనున్నారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ తరఫున అలంపూర్ నియోజక వర్గం నుంచి సంపత్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version