తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ ప్రవేశాలకు విద్యాశాఖ మరో అవకాశం కల్పించింది. టెన్త్ పాస్ అయ్యి ఇప్పటికీ అడ్మిషన్ తీసుకొని విద్యార్థులు ఈనెల 10 లోపు కాలేజీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా మరో కాలేజీలో రీ అడ్మిషన్ చేసుకోవచ్చని సూచించింది.
ఇది ఇలా ఉండగా, తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పది చదువుతున్న విద్యార్థులు 2023 నవంబర్ 17లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1 వరకు రూ. 50 ఫైన్ తో, డిసెంబర్ 11 వరకు రూ. 200 ఫైన్ తో , డిసెంబర్ 20వ తేదీ వరకు రూ. 500 ఫైన్ తో ఫీజు చెల్లించొచ్చు. రెగ్యులర్ విద్యార్థులు రూ. 125, మూడు సబ్జెక్టులు.. అంత కంటే తక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125, వొకేషనల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది.