కిమ్స్ ఆసుపత్రిలో శ్రీ తేజ్ ను పరామర్శించిన అల్లు అరవింద్

-

డిసెంబర్ 04న పుష్ప-2 ప్రీమియర్స్ షోలు ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రీమియర్ షో ప్రదర్శించిన సమయంలో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు లోని సంధ్య 70ఎంఎం లో వీక్షించారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి ఓ మహిళా మరణించింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను సినీ నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు.

బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ తేజ్ ఆరోగ్యం విషమంగానే ఉన్నదని కిమ్స్ వైద్యులు చేతన్, విష్ణు తేజ్ లు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ఐసీయూలో వెంటిలేటర్ పై ఉన్నాడన్నారు. మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదని.. బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ట్యాబ్ ద్వారా ఆహారం అందిస్తున్నామని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version