చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణ తాజాగా పూర్తి అయింది. అయితే ఈ విచారణ అనంతరం పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి పోలీస్ బందోబస్త్ మధ్య బయలుదేరి వెళ్లారు అల్లు అర్జున్. దాదాపు మూడున్నర గంటల పాటు అల్లు అర్జున్ ని విచారించారు పోలీసులు. విచారణ సందర్భంగా అల్లు అర్జున్ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన పై న్యాయవాదుల సమక్షంలో పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏసీపీ రమేష్, ఇన్ స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో ఈ విచారణ జరిగింది. అవసరం అయితే మరోసారి విచారణకు రావాలని పోలీసులు ఆదేశించగా.. తప్పకుండా సహకరిస్తానని హామీ ఇచ్చారు అల్లు అర్జున్. విచారణ సందర్బంగా అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దే ఉన్నారు. విచారణ ముగిసిన తరువాత వారంతా కలిసి వెళ్లారు.