తెలంగాణలో 21 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన

-

తెలంగాణలో 21 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే.. ఆగస్టు 6న తెలంగాణలో 21 అమృత్ భారత్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీంతో తెలంగాణలో మొత్తం 39 అమృత్ భారత్ స్టేషన్లు కానున్నాయి. తొలివిడతలో రూ.894 కోట్ల వ్యయంతో 21 స్టేషన్లలో పనులు ప్రారంభం చేయనున్నారు. ఈ పథకం ద్వారా.. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ప్రయాణీకుల సౌకర్యార్థం వసతుల కల్పన, స్వచ్ఛత, ఉచిత వైఫై తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది కేంద్ర ప్రభుత్వం.

మొదటి విడతలో 6 ఆగస్టున ప్రధాని చేతుల మీదుగా పనులు ప్రారంభం కానున్న స్టేషన్లు 21 : ఖర్చుచేయనున్న మొత్తం రూ.894 కోట్లు

హైదరాబాద్ (నాంపల్లి) – 309 కోట్లు
నిజామాబాద్ – 53.3 కోట్లు
కామారెడ్డి – 39.9 కోట్లు
మహబూబ్‌నగర్ – 39.9 కోట్లు
మహబూబాబాద్ – 39.7 కోట్లు
మలక్‌పేట్ (హైదరాబాద్)- 36.4 కోట్లు
మల్కాజ్‌గిరి (మేడ్చల్) – 27.6 కోట్లు
ఉప్పుగూడ (హైదరాబాద్)- 26.8 కోట్లు
హఫీజ్ పేట (హైదరాబాద్) – 26.6 కోట్లు
హైటెక్ సిటీ (హైదరాబాద్) – 26.6 కోట్లు
కరీంనగర్ – 26.6 కోట్లు
రామగుండం (పెద్దపల్లి)- 26.5 కోట్లు
ఖమ్మం – 25.4 కోట్లు
మధిర (ఖమ్మం) – 25.4 కోట్లు
జనగాం – 24.5 కోట్లు
యాదాద్రి (యాదాద్రి భువనగిరి)- 24.5 కోట్లు
కాజీపేట జంక్షన్ (హన్మకొండ)- 24.5 కోట్లు
తాండూర్ (వికారాబాద్)- 24.4 కోట్లు
భద్రాచలం రోడ్ (కొత్తగూడెం)- 24.4 కోట్లు
జహీరాబాద్ (సంగారెడ్డి)- 24.4 కోట్లు
ఆదిలాబాద్ – 17.8 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version