తెలంగాణ ప్రజలు రానున్న శ్రీరామనవమి తర్వాత మరో శుభవార్త వింటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లోని అతి ముఖ్యమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి మంత్రి కీలక అప్డేట్ వెలువరించారు. శ్రీరామనవమి తరువాత నుంచి లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని, ఇందిరమ్మ పాలనలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగనివ్వమని పేర్కొన్నారు.
రైతుల విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించవద్దని ఆయన హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో తరుగు పెడితే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. రైతులకు ఇప్పటివరకు రూ.20,609 కోట్లు రుణమాఫీ చేశామని, రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు.