Telangana Heavy Rains: గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని మంత్రి రాజా నరసింహ అధికారులను ఆదేశించడం జరిగింది.
అవసరమైన వారందరికీ పరీక్షలు చేసి, మందులు ఇవ్వాలన్నారు. వర్షాల వల్ల ఏర్పడిన వరదల కారణంగా జ్వరాలు, డయేరియా వంటి అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కావున ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఫీవర్ సర్వే అక్కడ బందీగా చేయాలంటూ చెప్పారు. అందుకే ప్రజల వద్దకే వెళ్లి వైద్య సేవలను అందించాలని సూచనలు జారీ చేశారు.