మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు..రూ.1000 కోట్లట!

-

మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ కు మరో షాక్‌ తగిలింది. మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై మరో భూ కుంభకోణం ఫిర్యాదు తెరపైకి వచ్చింది. దాదాపు రూ. 1000 కోట్ల విలువ చేసే భూమిని అమోయ్ కుమార్ మాయం చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా తట్టి అన్నారం గ్రామంలోని మధురా నగర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

Another land scam complaint against former collector Amoy Kumar

దీంతో ఈ కేసుపై ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. ఇక అటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో ని ప్రభుత్వ భూమి వట్టినాగులపల్లి, కాజాగూడా లోని పలు ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పన్నంగా అప్పగించాడని అమోయ్ కుమార్‌ పై ఆరోపణలు ఉన్నాయి. మొత్తం నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చే లాగా అమాయకుమార్ భూముల కేటాయింపు జరిపాడని ఆరోపణలు వస్తున్నాయి. ఈ భూ కేటాయింపుల వెనక అప్పటి ప్రభుత్వ పెద్దల హస్తం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. ఈ భూముల కేటాయింపు ద్వారా లబ్ధి పొందిన డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version