ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పెద్దపులి దాడి చోటు చేసుకుంది. సిర్పూర్ మండలం దుబ్బగూడలో పొలంలో పనిచేస్తున్న రైతుపై దాడి చేసింది పెద్దపులి. ఈ సంఘటనలో రైతు సురేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆసుపత్రికి తరలించారు. అసిఫాబాద్ జిల్లాలో కొనసాగుతున్న పులుల దాడులు నిన్న మహిళ లక్ష్మీ పై దాడి చేసి హతమార్చింది పులి.
ఇక నేడు సిర్పూర్ టౌన్ దుబ్బగూడ గ్రామం దగర లో చేనులో పని చేస్తున్న రౌత్ సురేష్ అనే రైతు పై పులి దాడి చేసింది. ఈ సంఘటనలో సురేష్ మెడ పై తీవ్ర గా యాలు అయ్యాయి. దీంతో అతనిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఆసిఫాబాద్ జిల్లాకు కొత్తగా వచ్చిన పులిగా భావిస్తున్నారు అధికారులు. మహరాష్ట్ర నుంచి వచ్చిన పులే దాడి చేసి ఉంటుదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు ఉన్నతాధికారులు.