ఈ ఏడాది దేశమే ఆశ్చర్యపోయే కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని జ్యోతిష్యులు బాచుపల్లి సంతోష్ కుమార్ చెప్పారు. ప్రగతి భవన్ లో బాచుపల్లి సంతోష్ కుమార్ పంచాంగం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న ప్రభ మళ్ళీ వెలుగబోతుంది… ఈ సంవత్సరం ఎక్కువ మంచి జరగబోతుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిపాలన అందిస్తారని.. పంటలు అద్భుతంగా పండపోతున్నాయి.. రైతుల రాజులు కాబోతున్నారని చెప్పారు. 2015 నుండి ఇప్పటి వరకు వర్షాల కు రాష్ట్రం లో ఇబ్బందులు లేవు.. ప్రజా ఆరోగ్యం బాగా ఉంటుంది… మాస్క్ లు అక్కర్లేదని స్పష్టం చేశారు. వాగ్దాటి గల వ్యక్తులకు రాజా యోగమని.. రాష్ట్రం లో యజ్ఞ యాగదులు ఎక్కువగా జరగాలని పేర్కొన్నారు.
సరిహద్దులలో ఉద్రిక్తత లు తలెత్తేఅవకాశం.. పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం ఉంటుందని.. రాజకీయంగా పెను మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. పార్టీ లు మారే వారికి గడ్డుకాలమని.. విద్యా రంగం పట్టాలు ఎక్కబోతుంది… ఆన్లైన్ తరగతులు ఇక ఉండవని చెప్పారు. ఇది ఉద్యోగ నామ సంవత్సరమని.. 75 శాతం మంచి ఫలితాలు, 25 శాతం చెడు ఫలితాలు ఉంటాయన్నారు.