గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, స్పీకర్ ప్రసాద్ కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ సుజయ్ పాల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
సాధారణంగా ప్రతీ సంవత్సరం జనవరి 26న రాజ్ భవన్ లో గవర్నర్ ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రజాపాలనలో ఉత్తమంగా పని చేసిన అధికారులకు గవర్నర్ అవార్డులను అందజేశారు.