సర్వేల్ గురుకులంలో దారుణం.. విద్యార్థికి తీవ్ర గాయం..!

-

సాధారణంగా గురుకుల పాఠశాల అంటే తెలంగాణలో సర్వేల్  పాఠశాలను ఆదర్శంగా తీసుకుంటారు. అక్కడ చదివిన విద్యార్థులందరూ టాప్ పొజిషన్ లో ఉన్నారు. అక్కడ ఎక్కువగా మంచి రిజల్ట్స్ వస్తాయనే నమ్మకం విద్యార్తుల్లో ఉంటుంది. ఇవాళ అదే గురుకులంలో విద్యార్థినితో వంట చేయిస్తే, వేడి రాగి జావ పడి ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన పరిస్థితి నెలకొంది.

తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్న దారుణాలకు ఇది మరో నిదర్శనం. ” 1971లో ముఖ్యమంత్రి హోదాలో దివంగత పీవీ నరసింహారావు గారు దేశంలో మొదటి గురుకులన్ని యాదాద్రి భువనగిరి జిల్లా, సర్వేల్ లో ప్రారంబించారు.అదే గురుకులంలో విద్యార్థినితో వంట చేయిస్తే.. వేడి రాగి జావ పడి ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన పరిస్థితి.ఒకవైపు అసెంబ్లీలో గురుకులాలపై చర్చ, మరోవైపు అదే సమయంలో ఈ దారుణం. గురుకులల్లో దారుణమైన పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కడమే తప్ప, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం అననారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి. మీ పాలనలో రోజు రోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని కాపాడండి. గాయపడ్డ విద్యార్థినికి మంచి వైద్యం అందించండి” అంటూ ట్వీట్ చేశారు హరీశ్ రావు,.

Read more RELATED
Recommended to you

Exit mobile version