హైదరాబాదులో మరో విషాదం చోటు చేసుకుంది. ఏడు సంవత్సరాల బాలుడిని దుండగులు హత్య చేశారు. తాజాగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోల్డెన్ సిటీ లో దారుణ సంఘటన జరిగింది. ఏడు సంవత్సరాల బాలుడిని దారుణంగా హత్య చేశారు.
బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేసి… మీరాలం ట్యాంకు సమీపంలో దుండగులు పడేయడం జరిగింది. ఇక స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు రంగంలోకి దిగారు పోలీసులు. ప్రస్తుతం సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడు వివరాలు సేకరిస్తున్నారు. మిస్సింగ్ కేసుల వివరాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
ఏడేళ్ల బాలుడిని హత్య చేసిన దుండగులు
హైదరాబాద్ అత్తాపూర్ పీఎస్ పరిధిలోని గోల్డెన్ సిటీలో దారుణ ఘటన
బాలుడి తలపై రాళ్లతో కొట్టి హత్య చేసి మీరాలం ట్యాంక్ సమీపంలో పడేసిన దుండగులు
బాలుడి వివరాలను సేకరిస్తున్న పోలీసులు
మిస్సింగ్ కేసుల వివరాలపై పోలీసుల ఆరా pic.twitter.com/vdzS2hxrUg
— BIG TV Breaking News (@bigtvtelugu) April 3, 2025