దారుణం.. ఇంట్లోకి వచ్చిందని కుక్కపై, యజమానిపై, అతని భార్యపై దాడి

-

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోకి వచ్చిందని కుక్కపై, యజమానిపై, అతని భార్యపై దాడి చేశారు. మధురానగర్ లోని రహమత్ నగర్‌లో ఉండే శ్రీనాథ్ పెంపుడు కుక్క ఎదురింట్లో ఉండే ధనుంజయ్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరగగా అదును చూసి ధనుంజయ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి శ్రీనాథ్‌పై, శ్రీనాథ్‌ భార్యపై, పెంపుడు కుక్కపై కర్రలతో దాడి చేసి కొట్టారు.

Attack on the dog, the owner and his wife for coming into the house

తీవ్రంగా గాయపడిన కుక్కను, దాన్ని పెంచుకుంటున్న కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పోలీసులకు సమాచారం అందదాంతో ఘటనపై మధురానాగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడి సమయంలో సైతం హస్కి కుక్క తోక ఊపుతూ తన విశ్వాసాన్ని ప్రదర్శించింది. అయినా అక్కసుతో యువకులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.

https://x.com/TeluguScribe/status/1790933195342369003

Read more RELATED
Recommended to you

Exit mobile version