హైదరాబాద్లో నందమూరి ఫ్యామిలీ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి గురించి తెలియని వారు ఉండరు. ఈ ఆస్పత్రి రోగులకు మెరుగైన చికిత్స అందిస్తూ వైద్య రంగంలో తనవంతు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో తన సేవలకు గానూ బసవతారకం ఆస్పత్రి అరుదైన ఘనత దక్కించుకుంది.
దేశంలోనే రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా బసవతారకం ఇండో-అమెరికన్ ఆస్పత్రి నిలిచింది. ఈ ఆస్పత్రిని రెండో ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా ‘ఔట్‌లుక్ ఇండియా’ ప్రకటించింది. దీనిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.
“దేశంలో రెండో ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని ‘ఔట్ లుక్ ఇండియా’ పత్రిక ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ, యాజమాన్యం, వైద్య సిబ్బందికి నా అభినందనలు. ‘తక్కువ ఖర్చులతో కూడుకున్న వైద్యం, మెరుగైన సంరక్షణ, ప్రపంచ స్థాయి చికిత్స విధానాల వల్లే బసవతారకం ఆసుపత్రి ఈ ఘనత సాధించింది’.” – చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత
My heartfelt congratulations to Chairman Sri Nandamuri Balakrishna Garu, management and staff of Basavatarakam Indo American Cancer Hospital @basavatarakam for being awarded the 2nd Best Oncology Hospital in India by the @Outlookindia Magazine.
I commend the team’s herculean… pic.twitter.com/RWG3UEzIHO
— N Chandrababu Naidu (@ncbn) May 24, 2023