భారీ ఆకారంలో రూపుదిద్దుకున్న బాలాపూర్ గణేష్

-

బాలాపూర్ గణేష్…ఈ ఏడాది కూడా భారీ ఆకారంలో దర్శనమివ్వనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ టెంపుల్ తరహాలో బాలాపూర్ గణేష్ కోసం సెట్ ఏర్పాటు చేస్తున్నారు నిర్వహాకులు. ఈ మేరకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇవాళ సాయంత్రం బాలాపూర్ గణేష్ కు పూజలు జరుగనున్నాయి. ఇక బాలాపూర్ లడ్డూ కి 27 ఏళ్ల చరిత్ర ఉందన్న సంగతి తెలిసిందే.

Balapur Ganesh in huge shape

గతేడాది 24.60 లక్షలు లడ్డూ ధర పలికింది. పొంగులేటి లక్ష్మారెడ్డి…గత ఏడాది బాలాపూర్ గణేష్.. లడ్డూను సొంతం చేసుకున్నారు. 2021లో బాలాపూర్‌ లడ్డూ 18.90 లక్షలు పలికిన లడ్డూ…. 2021 కంటే 5.70 లక్షలు అధికంగా ధర పలికింది. ఇక ఈ ఏడాది బాలాపూర్ గణేష్.. లడ్డూ ధర ఎంత పలుకుతుందో చూడాలి.

కాగా, ఇవాళ వినాయక చవితి కావడంతో తెల్లవారుజాము నుంచే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తొక్కిసలాట, తోపులాట చోటుచేసుకోకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version