కేసీఆర్ ను వదిలిపెట్టం…యుద్దాన్ని కొనసాగిస్తాం : బండి

-

నిన్న జరిగిన ఎన్నికల ఫలితాలు గెలిచిన ఇద్దరి అభ్యర్థులకు బీజేపీ తరపున శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గెలిచిన తర్వాత కేసీఆర్ నవ్వులు తెలుసు దాని వెనుక రాక్షస ఆనందం తెలుసుని, బీజేపీ భయానికి కేసీఆర్ నిద్రలేని రాత్రులు గడిపాడని అన్నారు. కేసీఆర్ కు బీజేపీ చుక్కలు చూపించిందన్న ఆయన అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ,నిరుద్యోగులు ఎంతో కష్టపడ్డారని అన్నారు. గెలిచేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, గురుతర బాధ్యత కేసీఆర్ కు అప్పగిస్తే రాక్షస పాలన చేస్తున్నారని అన్నారు. ఇవాళ పి వి నరసింహారావు గెలిచారా..?కేసీఆర్ గెలిచారా..? అని ప్రశ్నించారు.

ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేస్తా, మీ సంఘాలను రద్దు చేస్తామని ప్రగతి భవన్ కి పిలిపించి వారిని భయభ్రాంతులకు గురి చేశారన్న ఆయన ఉద్యోగులను మానసిక వేదనకు గురి చేసి కోట్ల రూపాయలు వెదజల్లారని అన్నారు.  బీజేపీ లక్ష్యం 2023 అని పేర్కొన్న ఆయన 70 శాతం మంది ఓటర్లు టీఆర్ఎస్ ను వ్యతిరేకించారు..వ్యతిరేక ఓటు చీలడం వల్ల టీఆర్ఎస్ గెలిచిందని అన్నారు. నాగార్జున సాగర్ లో గెలిచి తీరుతాం.. అది గుర్తు మీద జరిగే ఎన్నికలు…పువ్వు గుర్తు ప్రజల గుండెల్లో ఉంది అన్నారు. కేసీఆర్ ను వదిలిపెట్టం…యుద్దాన్ని కొనసాగిస్తాం అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version