బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రేపు అమెరికా పర్యటనకు వెళ్ళనున్నారు. NRIల ఆహ్వానం మేరకు రేపు ఉదయమే అమెరికాకు పయనమై… అక్కడ ఆప్టా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. సెప్టెంబర్ 10న బండి సంజయ్ తిరిగి స్వదేశానికి రానున్నారు.
సెప్టెంబర్ 1 నుంచి 10 రోజులపాటు యూఎస్ లోనే సంజయ్ ఉండనున్నారు. సెప్టెంబర్ 2న అట్లాంటాలో జరిగే ఆప్తా (అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్) 15వ వార్షికోత్సవంలో ప్రసంగించనున్నారు బండి సంజయ్. అటు వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్, టెక్సాస్ సహా పలు రాష్ట్రాల్లో బండి సంజయ్ పర్యటన ఖరారు అయింది. అనంతరం ఆయా రాష్ట్రాల్లో ఎన్ఆర్ఐ సంఘాలతో సమావేశం కానున్నారు బండి సంజయ్. ఇక అమెరికా పర్యటన నేపథ్యంలో ప్రసిద్ధ న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై బండి సంజయ్ వీడియోను ప్లే చేశారు.