తెలంగాణలో బీజేపీ -కాంగ్రెస్ మధ్యనే పోటీ..BRS ది మూడో స్థానమే – బండి సంజయ్

-

తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది…బీఆర్‌ఎస్‌ పార్టీది మూడో స్థానమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్‌. కరీంనగర్ లో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కొండగట్టుకు నిధులు ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని…తెలంగాణ రాష్ట్రం కొండగట్టు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.. కేంద్రం నుంచి తప్పకుండా సహకారం ఉంటుందన్నారు.

సీబీఐ, ఈడీలతో బీజేపీకి సంబంధం లేదు..వారికి ఉన్న ఆధారాలు, అధికారాలను అనుసరించి కవితపై చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే.. గతంలో అధికారాన్ని పంచుకున్నారు…వారికి గతంలో సంబంధం ఉంది.. ఇప్పుడూ ఉందన్నారు. గతంలో బీజేపీ బిఅరెస్ ఒకటే ప్రచారం చేసి మా కొంప ముంచారని ఫైర్ అయ్యారు.

ఐదారు రోజుల్లో తెలంగాణలో వీలైనన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించబోతున్నాం..విజయ సంకల్ప యాత్రలకు మంచి స్పందన ఉందన్నారు. కేంద్రంలో 370 ఎంపీ సీట్ల టార్గెట్ రీచ్ అవుతాం… నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అవుతారని తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ సహా 17 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version